కేటీఆర్ చొరవతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటి పరిశ్రమలు రావడం గొప్ప విషయం అన్నారు మంత్రి ఈటల రాజేందర్. వరంగల్ జిల్లా మడికొండలో టెక్ మహీంద్ర,సైయెంట్ ఐటీ కంపెనీలను కేటీఆర్ ప్రారంభించగా ఈ సందర్భంగా మాట్లాడిన ఈటల …తెలంగాణ ఉద్యమ సమయంలో చెప్పిన విధంగా సీఎం కేసీఆర్ కృషితో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు.
ఒకప్పుడు పరిశ్రమలు అనగానే ఒక్క హైదరాబాద్ కు మాత్రమే పరిమితమయ్యాయని…కానీ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ కంపెనీలు విస్తరిస్తున్నాయని చెప్పారు. ముఖ్యంగా వరంగల్ , కరీంనగర్ లలో చదువుకున్న గ్రామీణ యువత ఎక్కువగా ఉందని…గ్రామీణ యువత కోసం ప్రత్యేక ప్రణాళికలు చేయాలని ఐటి మంత్రి కేటీఆర్ ను కోరారు..
వరంగల్ కు రెండు పెద్ద ఐటి కంపెనీలు టెక్ మహీంద్రా, సీఏంట్ లు రావడం ఆనందంగా ఉందన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. కేటీఆర్ ఆలోచనలతో మరిన్ని ఉపాధి అవకాశాలు కలిగే పరిశ్రమలు,కంపెనీలు రావాలన్నారు.