ఖమ్మం, కరీంనగర్ ,నిజామాబాద్,మెదక్లో ఐటి హబ్ ను ప్రారంభిస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ అర్బన్ జిల్లా మడికొండలోని టెక్ మహీంద్రా ఐటి ఇంక్యుబేషన్ , సియేట్ ఐటి కంపెనీలను ప్రారంభించారు మంత్రి కేటీఆర్.
తెలంగాణ లో కంపెనీలను నెలకొల్పాలని అడిగిన మరుక్షణం ఒకే చెప్పిన టెక్ మహీంద్రా సీఈఓ గురునాని, సియేట్ ఎండి మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఐటి విస్తరణ ఇది ప్రారంభం మాత్రమేనన్నారు.
సియేట్ కంటే టెక్ మహీంద్రా పెద్ద సంస్థ. సియేట్ లో 16 వేలు, టెక్ మహీంద్రలో 1 లక్ష 60 వేళా మంది ఉద్యోగులు ఉన్నారని చెప్పారు కేటీఆర్. వరంగల్ లో మూత బడ్డ అజజాహి మిల్లు స్థానంలోనే కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు నిర్మిస్తున్నాం అన్నారు.
హైదరాబాద్ .. వరంగల్ కు రహదారి నిర్మాణం సాగుతోంది. ఘాట్ కేసర్ దగ్గర స్కైవే నిర్మాణం తో గంటన్నారలో చేరుకునేలా తయారౌతుందన్నారు. వరంగల్ హైదరాబాద్ హైవే ను పారిశ్రామిక కారిడార్ ప్లానింగ్ ఉంది. యాదాద్రి, జనగామ, స్టేషన్ ఘనపూర్, పరకాల లాంటి చిన్న ప్రాంతాల్లోనూ చేనేత పరిశ్రమలను నిర్మిస్తాం అన్నారు.
మహబూబాబాద్ లో ఆహార శుద్ధి పరిశ్రమ సెంటర్ నెలకొల్పుతామని….కాళేశ్వర నీళ్లు వస్తున్న తరుణంలో ఆహార పదార్థాలు వ్యవసాయ రంగంలో పెరుగుతున్నాయి.టెక్జ్ మహీంద్రా సీఈఓ గురునాని చెప్పిన సలహా మేరకు మామూనూర్ ఎయిర్ పోర్టు పునరుద్దరణతో పాటు.. హెలిపాడ్ సెంటర్ ని సీఎం కేసీఆర్ తో మాట్లాడి త్వరలోనే ప్రారంభిస్తాం అన్నారు.
నీళ్లు, నిధులు , నియామకాలు నినాధమే తెలంగాణ ఆవిర్భావం…సీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు కాళేశ్వరం ను కాలంతో పోటీ పడి మరీ నిర్మిస్తున్నాం అన్నారు. సీఎం కేసీఆర్ ఆలోచన విధానంతో అన్నిరంగాల్లో ముందుండి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాం అని…రాష్ట్ర ఆదాయం పెంచి సంక్షేమానికి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన అన్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు భర్తీ చేస్తున్నప్పటికీ నిరుద్యోగ యువత ఉందని…12, 13 లక్షల మంది నిరుద్యోగ యువతకు స్కిల్ డెవలప్మెంట్ కోసం శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఇలా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళుతున్నాం…రానున్న రోజుల్లో లైఫ్ సైన్స్ పరిశ్రమలు కూడా వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో టెక్ మహీంద్రా సిపి గురునాని, సియేట్ ఎండి మోహన్ రెడ్డి, మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, ఈటెల రాజేందర్, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు అరురి రమేష్, తాటికొండ రాజయ్య, నరేందర్, చల్లా ధర్మారెడ్డి, ఎంపీలు పసునూరి దయాకర్, బండ ప్రకాష్, మేయర్ గుండా ప్రకాష్, జడ్పీ ఛైర్మన్ లు సుధీర్ కునర్, గండ్ర జ్యోతి, సంపత్ రెడ్డి పాల్గొన్నారు.