“యుద్ధకాండ ” పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్

370
kcr book
- Advertisement -

సీఎం కేసీఆర్ ప్రధాన పౌర సంబంధాల అధికారి వనం జ్వాలా నరసింహారావు, అనువక్త-వాచవిగా రచించిన శ్రీ మదాంధ్ర వాల్మీకి రామాయణం “యుద్ధకాండ మందర మకరందం” పుస్తకాన్ని శనివారం సాయంత్రం ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్యేలు సురేందర్, మర్రి జనార్ధన్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, పీఆర్వో రమేశ్ హజారీ తదితరులు పాల్గొన్నారు.

vanam

యుద్ధకాండతో కలుపుకొని జ్వాలా నరసింహారావు రామాయణం మొత్తం ఆరు కాండల రచనలు పూర్తి చేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రచయితను అభినందించారు. “యుద్ధకాండ మందర మకరందం”, ఆంధ్రవాల్మీకి వావిలికొలను సుబ్బారావు యథా వాల్మీకంగా తెలుగులో అనువదించిన మందరాలకు శిష్ఠ వ్యవహారిక భాషలో యథాతథంగా రచించిన పుస్తకం యథాతథంగా రచించారు.

- Advertisement -