- Advertisement -
టాలీవుడ్లో సినిమా సెట్టింగ్‌లకు కేరాఫ్ దర్శకుడు గుణ శేఖర్. కథ డిమాండ్‌ను బట్టి ఎన్నికోట్లు పెట్టయిన సినిమా సెట్టింగ్ వేయించేందుకు వెనుకాడరు గుణశేఖర్. ఇక రుద్రమదేవి మూవీ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని రానాతో హిరణ్య కశప చేస్తున్న గుణశేఖర్ ఈమూవీ కోసం కూడా భారీ సెట్‌ను ప్లాన్ చేశాడు.
ఏకంగా రూ. 40 కోట్ల ఖర్చుతో సెట్ వేసేలా ప్లాన్ చేశాడు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏకంగా ఓ ఊరి సెట్‌నే వేసేలా కసరత్తు చేస్తున్నాడు. ఈ సినిమాను గుణ శేఖర్-సురేష్ బాబు కలిసి నిర్మిస్తుండగా త్వరలో విడుదల కానుంది.
గతంలో మహేష్ బాబు ఒక్కడు మూవీ కోసం చార్మినార్,అర్జున్ సినిమా కోసం మధుర మీనాక్షి దేవాలయం సెట్స్ వేశాడు. తాజాగా గుణ శేఖర్ ప్లాన్ చేస్తున్న సెట్ బాహుబలి కంటే పెద్దదిగా ఉండనున్నట్లు సమాచారం. మరి హిరణ్య కశపతో గుణశేఖర్ ఎలాంటి రిజల్ట్ రాబడతాడో వేచిచూడాలి.
- Advertisement -