సాయం చేసేందుకు సీఎం కేసీఆర్ ఉన్నారు: చిరు

587
chiru
- Advertisement -

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కి ఎలాంటి సాయం కావ‌ల‌న్నా చేయ‌డానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నార‌ని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. పార్క్ హ‌య‌త్ హోట‌ల్‌లో మా డైరీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన చిరంజీవి ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సాయం చేసేందుకు సానుకూలంగా ఉన్నారని చెప్పారు.

ఇండ‌స్ట్రీకి సంబంధించి అన్ని వివ‌రాల‌ని డైరీలో పొందుప‌రిచారని….ఈ ఏడాది రెండు లేదా మూడు ఈవెంట్స్ చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని అన్నారు. నాగార్జున‌, బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ప్ర‌భాస్‌ల‌తో పాటు ఇత‌ర యువ క‌థానాయకుల‌ని కూడా ఈ ఈవెంట్‌లో భాగం కావాల‌ని కోర‌తానని చెప్పారు. అందరం కలిసి ఇండస్ట్రీని ఎలా బాగుచేసుకుందాం అనే దానిపై చర్చించుకుందామని స్పష్టం చేశారు.

ఇక మా డైరీ ఆవిష్కరణ సందర్భంగా చిరంజీవి-రాజశేఖర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ దశలో రాజశేఖర్‌పై అసహనం వ్యక్తం చేసిన చిరు ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. దీనికి స్పందించిన కృష్ణంరాజు..బహిరంగంగా మాపై విమర్శలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -