భాగవత సప్తాహం కార్యక్రమంలో పాల్గోన్న కోలేటి దామోదర్

507
koleti Damodar
- Advertisement -

హైదరాబాద్ సీతారాంబాగ్ లోని పరమపవిత్రమైన శ్రీ జగన్నాథ్ మఠంలో శ్రీ చిన్నజీయర్ స్వామి ఆశిస్సులతో శ్రీమత్ భాగవత సప్తాహం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ సప్తాహంలో వేలాది మంది భక్తులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పాల్గోన్నారు.

koleti

ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భాగవతం చదివినా, విన్నా ఎంతో పుణ్యప్రదమని, ఇటువంటి కార్యక్రమాల్లో పాల్గోనడం వల్ల ప్రజలతకు సత్ శీలత అలవడుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని అన్నారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికి ఈ మధ్య ఎన్టీఆర్ గార్డెన్ లో చాగంటి కోటేశ్వర్ రావు చేసిన భాగవత ఉపన్యాసాలలో కుటుంబ సమేతంగా పాల్గోన్నారని గుర్తు చేశారు. అనంతరం దామోదర్ గుప్తాకు స్వామి వారి శేషవస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేశారు.

- Advertisement -