మరో మూడు రోజుల్లో 2019సంవత్సరం ముగియనుంది. 2020సంవత్సరానికి వెల్ కమ్ చెప్పేందుకు చాలా మంది చాలా రకాల ప్లాన్ ను వేసుకుంటున్నారు. కానీ 2020సంవత్సరం మనకు పెద్ద చిక్కు తీసుకురానుంది. రాబోయే సంవత్సరం 2020 కావడంతో మనకు షార్ట్ కట్ లో మొత్తం రాయకుండా 20 అని రాస్తాం. అలా కాకుండా పూర్తి స్ధాయిలో రాయాలి. ఇలా రాయడం వల్ల మనం చాలా నష్టపోయే అవాకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చెక్కులు, ముఖ్యమైన డాక్యుమెంట్లపై డేట్ రాసే సమయంలో జాగ్రత్తగా ఉండకపోకపోతే కొంపమునిగే ప్రమాదం ఉంది.
ఉదాహరణకు మనం ఏదైనా పేపర్ పై డేట్ రాయాలంటే 05/01/2020 అని రాస్తాము ..కానీ కొంత మంది షార్ట్ కట్ లో సంవత్సరం ని ఫుల్ గా రాయకుండా 05/01/20 అని రాసేస్తారు. ఇలా రాయడం వల్ల చాలా ప్రమాదం పొంచి ఉంది. సంవత్సరం దగ్గర కేవలం 20 అని రాసి వదిలేస్తే 20 నెంబర్ తర్వాత ఏ నెంబర్ అయినా రాయొచ్చు. 20 తర్వాత 18 రాస్తే 2018 అవుతుంది. 19 రాస్తే 2019 అవుతుంది. కాబట్టి డాక్యుమెంట్లు, చెక్‌లపైన తేదీలు మార్చడం చాలా సులువు. కాబట్టి ముఖ్యమైన పేపర్లపై డేట్ లు రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్య 2020 సంవత్సరంలో మాత్రమే కొనసాగుతుంది.