- Advertisement -
జార్ఖండ్ ఎన్నికల్లో బిజేపికి మరో ఎదురుదెబ్బ తగలింది. ఇటివలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం కూటమి విజయం సాధించింది. ఈసందర్భంగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కు పలువురు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జేఎంఎం నేత హేమంత్ సోరెన్ కు అభినందనలు తెలిపారు.
హేమంత్ తండ్రి శిబుసోరెన్, హేమంత్ సోరెన్ ఇద్దరు తెలంగాణ ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు సీఎం. జార్ఖండ్ లో జేఎంఎం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తెలంగాణ ప్రజలకు ఆనందకర విషయమని సీఎం కేసీఆర్ చెప్పారు.
- Advertisement -