ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి:ఓవైసీ

528
owaisi
- Advertisement -

ఈ దేశం మనది, మనం భారతీయులం.. ప్రతి ముస్లిం ఇంటిపై జాతీయ జెండా ఎగరాలన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. హైదరాబాద్‌లో ఎన్ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఎంఐఎం భారీ సభను నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఓవైసీ గాంధీ, అంబేడ్కర్‌లను అవమానించేలా కేంద్రం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు.

స్వాతంత్ర లభించిన 70 ఏళ్ల తర్వాత భారతీయులమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఎన్ఆర్సీ కల్పిస్తోందని అన్నారు. సీఏఏ, ఎన్‌ఆర్సీలను వ్యతిరేకించే దేశంలోని ప్రతి ఒక్క ముస్లిం తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. ఇది నా దేశం.. నా దేశం కోసం నా ప్రాణాలను సైతం అర్పిస్తా అని ఉద్వేగంగా ప్రసంగించారు.

- Advertisement -