సీఎం కేసీఆర్ అధ్యక్షతన (చైర్మన్) ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు సభ్యులుగా రాఘవని నియమిస్తూ ఇవాళ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ సందర్భంగా రాఘవ మాట్లాడుతూ రోజు రోజుకు అంతరించిపోతున్న వన్యప్రాణులను సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉన్నదని. గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారు వీటిని రక్షించడం కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు అందులో భాగంగానే హరితహారం తో అడవులను పెంచే ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారని ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.
తన పై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కి, నా నియమాకానికి సహకరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కి; రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోస్‌కి, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకి కృతజ్ఞతలు తెలిపారు.
Raghava appointed as Telangana wild life board member….Raghava appointed as Telangana wild life board member