పాద‌చారుల ప్రెండ్లీగా జీహెచ్‌ఎంసీ రోడ్లు: లోకేష్‌ కుమార్

557
ghmc
- Advertisement -

జిహెచ్ఎంసిలో మౌలిక వ‌సతుల అభివృద్దికి ప్ర‌భుత్వం మంజూరు చేసిన నిర్మాణ ప‌నుల‌ను వేగంగా పూర్తిచేయ‌నున్న‌ట్లు క‌మిష‌న‌ర్ డి.ఎస్‌.లోకేష్ కుమార్ తెలిపారు. బుధ‌వారం జిహెచ్ఎంసి కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు ఆదేశాల మేర‌కు పాద‌చారుల సౌక‌ర్యార్థం రోడ్ల‌ను పెడెస్ట్రియ‌న్ ఫ్రెండ్లీగా తీర్చిదిద్ద‌నున్న‌ట్లు తెలిపారు.

ఈ మేర‌కు కొన్ని ప్రాంతాల్లో ప‌నులు మొద‌లు పెట్టిన‌ట్లు వివ‌రించారు. 709 కిలోమీట‌ర్ల వ్యూహాత్మ‌క రోడ్ల అభివృద్దికి నిర్దేశించిన రోడ్ల‌తో పాటు ప్ర‌తి జోన్‌లో ప‌ది కిలోమీట‌ర్ల పొడ‌వున ఫుట్‌పాత్‌లు, సెంట్ర‌ల్ మీడియంలు అభివృద్ది చేసేందుకు ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించ‌నున్న‌ట్లు తెలిపారు. వీధి వ్యాపారులకు కేటాయించిన ప్ర‌దేశంలో రోజువారి వ్యాపారం చేసుకునేందుకు అనువుగా గుర్తింపు కార్డులు జారీచేసిన‌ట్లు తెలిపారు.

గ్రీన్ జోన్స్ ఏర్పాటులో భాగంగా మెహిదీప‌ట్నం, ఉప్ప‌ల్‌ల‌లో ఇన్‌సెంటీవ్ డ్రైవ్ చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ప్ర‌తినెలా ఈ డ్రైవ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు వివ‌రించారు. జిహెచ్ఎంసి ద్వారా 350 చోట్ల ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. వివిధ సంస్థ‌ల ద్వారా మ‌రో వెయ్యి ప్రాంతాల‌లో ప‌బ్లిక్ టాయిలెట్లు ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. పార్కులు, ఓపెన్ ప్లేస్‌ల‌లో పిపిపి మోడ్‌లో కొత్త‌గా 1500 ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు.

జిహెచ్ఎంసి ప‌రిధిలో దాదాపు 2,600 నోటిఫైడ్ పార్కులు ఉన్నాయ‌ని తెలిపారు. అలాగే లేఅవుట్ ఓపెన్ ప్లేస్‌ల‌ను కూడా మ‌రుగుదొడ్ల నిర్మాణానికి కేటాయించ‌నున్న‌ట్లు తెలిపారు. న‌గ‌రంలో జిహెచ్ఎంసి, ఇత‌ర సంక్షేమ సంఘాల ద్వారా 3వేల పార్కులు చిన్న‌వి, పెద్ద‌వి ఉన్న‌ట్లు తెలిపారు. మార్చి 31లోపు ప్ర‌త్యేకంగా మ‌హిళ‌ల‌కై 34 షీ-టాయిలెట్ల‌ను నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు. ఎస్‌.ఆర్‌.డి.పి ద్వారా బ్యాంకుల ఆర్థిక స‌హాయంతో 24 ప్రాజెక్ట్‌ల‌కు నిధుల సేక‌ర‌ణ‌కై చేప‌ట్టిన ప్ర‌క్రియ తుది ద‌శ‌కు వ‌చ్చిన‌ట్లు తెలిపారు. ఈ నెలాఖ‌రులో బ్యాంకు రుణం మంజూరు అవుతుంద‌ని తెలిపారు.

వెంట‌నే ఈ ప‌నుల‌ను చేప‌ట్టి 2020 డిసెంబ‌ర్ లోపు పూర్తిచేయ‌నున్న‌ట్లు తెలిపారు. అలాగే 35 స్ట్రిప్‌, లింక్‌రోడ్ల అభివృద్దికి స‌మ‌గ్ర ప్రాజెక్ట్ నివేదిక సిద్దం చేసిన‌ట్లు తెలిపారు. వాటిలో 5డిపిఆర్‌ల‌కు ప్ర‌భుత్వం నుండి త్వ‌ర‌లోనే ఆమోదం ల‌భిస్తుంద‌ని తెలిపారు. పూణె న‌గ‌రంలోని పార్కులు, జంక్ష‌న్ల‌ను మోడ‌ల్‌గా తీసుకొని త‌క్కువ ఖ‌ర్చుతో మెయింట‌నెన్స్ ఉండే విధంగా ప‌నులు చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలిపారు. బ‌యోడైవ‌ర్సిటీ ఫ్లైఓవ‌ర్ పై నియ‌మించిన నిపుణుల క‌మిటి నివేదిక అందిన‌ట్లు తెలిపారు. నిపుణుల క‌మిటి సూచించిన విధంగా 40 కిలోమీట‌ర్ల వేగ ప‌రిమితిని అమ‌లు చేసేందుకు ఫ్లైఓవ‌ర్ పై ప‌నులు చేప‌ట్టిన‌ట్టు తెలిపారు.

ఈ ప‌నులు ప‌దిరోజుల‌లో పూర్తి అవుతాయ‌ని తెలిపారు. అనంత‌రం నిపుణుల క‌మిటి తుది ప‌రిశీల‌న అనంత‌రం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తేనున్న‌ట్లు తెలిపారు. వేగ ప‌రిమితిని అతిక్ర‌మించిన వాహ‌న‌దారుల‌పై భారీ జ‌రిమానాలు విధించే యోచ‌న ఉన్న‌ట్లు తెలిపారు. బ‌యోడైవ‌ర్సిటీ ఫ్లైఓవ‌ర్ నిర్మాణంలో ఎటువంటి లోపంలేద‌ని నిపుణుల క‌మిటి తేల్చిన‌ట్లు తెలిపారు. ఈ ఫ్లైఓవ‌ర్‌ను ప్రారంభించిన అనంత‌రం 540 వాహ‌నాలు ఓవ‌ర్ స్పీడ్‌తో వెళ్లిన‌ట్లు తెలిపారు. రెండు ప‌డ‌క గ‌దుల ఇళ్ల నిర్మాణం పుంజుకున్న‌ట్లు తెలిపారు. ప్ర‌భుత్వం ఇటీవ‌లనే రూ. 140 కోట్ల నిధుల‌ను విడుద‌ల చేసిన‌ట్లు తెలిపారు. ప్ర‌యోగాత్మ‌కంగా 60 ప్ర‌దేశాల్లోని రూ. 5ల‌కే భోజ‌నం అందిస్తున్న అన్న‌పూర్ణ క్యాంటీన్‌ల‌ను రూ. 11ల‌క్ష‌ల వ్య‌యం చొప్పున‌ ఆధునీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు. త‌దుప‌రి మిగిలిన వాటిని ఆధునీక‌రించ‌నున్న‌ట్లు తెలిపారు.

People Friendly roads a GHMC sats Lokesh Kumar…People Friendly roads a GHMC sats Lokesh Kumar…People Friendly roads a GHMC sats Lokesh Kumar

- Advertisement -