ప్లాస్టిక్ కాలకేయ విగ్రహావిష్కరణ

723
kalakeya statue univiled
- Advertisement -

ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ములుగు ప్రవేశం గట్టమ్మ దేవాలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన బాహుబలి కాలకేయ (ప్లాస్టిక్ భూతం) విగ్రహాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాహుబలి కాలకేయ అనే వ్యక్తి విలన్ గా నటించడం జరిగిందని, ప్లాస్టిక్ అనేది మానవాళి మనుగడకు, పర్యావరణానికి ఒక విలన్ గా మారిందని, ప్లాస్టిక్ ను పూర్తిగా నిషేధించి పర్యావరణాన్ని కాపాడ వలసిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు.

ఫిబ్రవరి 5 నుండి 8 వరకు నిర్వహించే అతిపెద్ద జన జాతర, వన జాతర, మేడారం మహా జాతరకు వచ్చే భక్తులు ఎవరైనా ప్లాస్టిక్ ను తీసుకు వస్తే కాలకేయ బాహుబలి విగ్రహం వద్ద వదిలి వెళ్లాలన్నారు. మేడారం మహాజాతర వన జాతరని, దట్టమైన వనం మధ్యలో జరిపే జాతరని, వన్యప్రాణులను పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాల చర్యలు చేపట్టడం జరిగిందని, మేడారం జాతరలో ఎవరు కూడా ప్లాస్టిక్ ను వాడకూడదని, పూర్తిగా ప్లాస్టిక్ ను నిషేధించడం జరిగిందని అన్నారు. మేడారం వచ్చే భక్తులు ప్లాస్టిక్ కు బదులుగా బట్ట, జూట్, కాగితం సంచులు, పేపర్ ప్లేట్స్, పేపర్ కప్స్, పర్యావరణ హితంగా ఉండే మట్టి, స్టీల్ పాత్రలను వాడాలని ఆయన కోరారు. ప్లాస్టిక్ రహిత మేడారం జాతరకు ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను పోషించాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఐ.టి.డి.ఎ. పి.ఓ. చక్రదర్ రావు, జిల్లా రెవిన్యూ అధికారి కె. రమా దేవి, జెడ్పీ సీఈవో ఏ. పారిజాతం, డి.పి.ఓ. వెంకయ్య, ఈడి ఎస్సి కార్పొరేషన్ తుల రవి, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Plastic kalakeya statue univiled at Bhupalpalli mulugu district collector c narayanreddy.Plastic kalakeya statue univiled at Bhupalpalli mulugu district collector c narayanreddy.

- Advertisement -