బడ్జెట్ సంప్రదింపుల సమావేశంలో మంత్రి హరీష్‌..

578
harsh rao
- Advertisement -

ఢిల్లీలో ఇవాళ అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో తెలంగాణ రాష్ట్ర తరపున ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిఎస్‌టి రాబడులను సమీక్షించడంతో పాటు.. అనేక రాష్ట్రాలకు బకాయిలున్న పరిహారం చెల్లింపులపై చర్చ. జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాల సాధికారతను పెంచేలా కేటాయింపులు జరపాలని సూచించాం. జిఎస్టీ, ఐజిఎస్టీ బకాయిల చెల్లింపు లతో రాష్ట్రాలకు ఊతమివ్వాలి. టాక్స్ చెల్లింపు దారుల కోసం ఆమ్నెస్టీ పథకం తీసుకురావాల్సిన అవసరం ఉంది. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్నారు మంత్రి హరీష్‌.

harish

తెలంగాణలో వెనుకబడిన ప్రాంతాలకు 450కోట్ల నిధులు విడుదల చేయాలి. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నీతిఅయోగ్ ప్రతిపాదనల మేరకు నిధులు కేటాయించాలి. మూడేళ్ల కాల వ్యవధికి మిషన్ భగీరథకు 19, 205 కోట్లు, మిషన్ కాకతీయ కు 5 వేల కోట్లు ఇవ్వాలి. దాదాపు లక్ష కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి కేంద్రం ఆర్థిక సహకారం అందించాలి. ఏపీ విభజన చట్టం ప్రకారం ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని మంత్రి కోరారు.

Union Finance Minister Nirmala Sitharaman held a pre-budget consultation meeting with the finance ministers of all states in Delhi today.

- Advertisement -