గాలి జనార్ధనరెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. కూతురు పెళ్లి కోసం బ్లాక్‌మనీని వైట్‌గా మార్చేందుకు గాలి ప్రయత్నించారని ఈ మధ్య వెలుగులోకొచ్చిన డ్రైవర్ రమేష్ గౌడ సూసైడ్‌తో స్పష్టమైంది. గాలి నోట్ల మార్పిడి వ్యవహారంలో కీలక పాత్ర పోషించిన రెవెన్యూ అధికారి నాయక్‌ను గుల్బర్గాలో ఈ ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సూసైడ్ నోట్‌లో ఉన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. నాయక్ నిజానిజాలను బయటపెడితే గాలి జనార్ధనరెడ్డిని కూడా త్వరలో అదుపులోకి తీసుకుని విచారించే అవకాశాలున్నాయి. 20శాతం కమీషన్‌తో గాలి జనార్థనరెడ్డి 100 కోట్ల డబ్బును వైట్‌గా మార్చినట్లు రమేష్ గౌడ సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.
కూతురు పెళ్లి ఘనంగా చేయాలనుకున్నాడు మైనింగ్ కింగ్ గాలి జనార్థన్ రెడ్డి. నోట్ల రద్దు సమస్య వచ్చిన కూతురు పెళ్లి విషయం ఎక్కడగా తగ్గలేదు. బ్రహ్మాండంగా కూతురు వివాహం చేశాడు. దానికి దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు పెట్టాడని ప్రచారం కూడా జరిగింది. గాలి కూతురు వివాహనికి అందరికి ఓ ప్రశ్న తలెత్తింది. అదేంటంటే…నోట్ల రద్దుతో ప్రజలు నానా అవస్థలు పడుతుంటే..గాలి జనార్థన్ మాత్రం కూతురు పెళ్లి అంత ఘనంగా ఎలా చేస్తున్నాడని అందరి మదిలి తోలిచేసింది.
ఇది ఒక్క సాధారణ ప్రేక్షకుడికే కాదు. ఐటీ వాళ్లకు కూడా ఇదే డౌట్ వచ్చి..గాలి ఇంటి పై దాడులు చేశారు.. పెళ్లికి ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క చెప్పాలన్నారు. కట్ చేస్తే..ఇప్పుడు పెళ్లి కోసం గాలి జనార్థన్ అక్రమంగా 100 కోట్ల రూపాయలను అక్రమంగా మార్పిడి చేసుకున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అందుకు సాక్షం కూడా ఉంది. ఇప్పటికే గాలికి సహాయం చేసిన అధికారి అరెస్ట్ అయ్యాడు. ఇందులో గాలి చేతివాటం ఎంత ఉందో చూడాలి. ఒకవేళ మాత్రం గాలి మరోసారి జైలు వెళ్లడం ఖాయమే.