ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి..నిమిషాల్లో 10 లక్షల రుణం

380
realme
- Advertisement -

స్మార్ట్ ఫోన్‌ల వాడకం పెరిగిపోవడంతో ప్రపంచం ఓ కుగ్రామంలా మారిపోయింది. ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో వైరల్‌గా మారుతోంది. స్మార్ట్ పోన్‌లు వాడకం పెరగడంతో రకరకలా కంపెనీలు,బ్యాంకులు కస్టమర్లను ఆకర్షించేందుకు యాప్‌ల రూపంలో సేవలను అందిస్తున్నాయి. ఫలితంగా బ్యాంకులకు వెళ్లకుండానే ఆన్‌లైన్‌లోనే మనీ ట్రాన్స్‌ఫర్,బిల్లు చెల్లింపులు చేసే సదుపాయం కలిగింది.

ఇక మరికొన్ని సంస్దలు ఏకంగా ఫోన్‌ ద్వారానే లోన్లు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. ప్రముఖ మొబైల్స్ తయారీదారు రియల్‌మి కొత్తగా రియల్‌మి పైసా (Realme PaySa) పేరిట ఓ నూతన యాప్‌ను లాంచ్ చేసింది.

ఈ యాప్‌లో కస్టమర్లు తమ వివరాలను నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవడం ద్వారా తమ అవసరాలకు అనుగుణంగా వ్యక్తిగత లేదా బిజినెస్ లోన్లను తీసుకోవచ్చు. అలాగే 3 నెలలపాటు ఉచితంగా క్రెడిట్ రిపోర్టును కూడా అందిస్తారు.

రియల్‌మి పైసా యాప్‌లో రూ.8వేల నుంచి గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణం లభిస్తుంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో మాత్రమే లభిస్తున్నది. త్వరలోనే ఐఓఎస్ ప్లాట్‌ఫాంపై కూడా ఈ యాప్‌ను లాంచ్ చేయనున్నారు. ఇప్పుడు ఈ యాప్‌కు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

- Advertisement -