సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ప్రతిరోజు పండగే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో గుడ్ న్యూస్ అందించారు మెగా ప్రొడ్యూసర్ దిల్ రాజు. త్వరలో పవన్‌తో మూవీ చేయబోతున్నానని దీంతో తన 20 సంవత్సరాల కల నెరవేరబోతుందని ప్రకటించారు.
పవన్ పింక్ రీమేక్ మూవీలో నటించనుండగా అప్పుడే సినిమాకు సంబంధించి మరో అప్ డేట్ వచ్చేసింది. టీ టౌన్ వర్గాల సమాచారం ప్రకారం జనవరి 7 నుంచి షూటింగ్ ప్రారంభం కానుండగా కేవలం 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసేలా ప్లాన్ చేశారట.
ప్రతి సంవత్సరం రెండు సినిమాలు చేయాలని భావిస్తున్న పవన్…ఎంత వీలైతే అంత త్వరలో కథల ఎంపిక,షూటింగ్ పూర్తయ్యేలా చూస్తున్నారట. ఇక పింక్ రీమేక్‌కి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. 2020 సమ్మర్లో సినిమాను విడుదల చేయనున్నారు. పవన్ సరసన నివేదా థామస్ హీరోయిన్గా నటించనుందని సమాచారం. త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.