అద్భుతం…డంప్‌ గ్రౌండ్‌ని ఇలా మార్చేశారు!

515
beltali
- Advertisement -

యూపీలో ఓ అధికారి చొరవతో ఆ గ్రామం రూపు రేఖలే మారిపోయాయి. కబ్జాలు, ఎక్కడ చూసిన దుర్వాసన,గుర్తు పట్టని శవాలకు కేరాఫ్ ఓ మాట చెప్పాలంటే సంఘ విద్రోహ శక్తులకు అడ్డాలా మారిన ఆ గ్రామపంచాయతీ రూపు రేఖలు మార్చేశాడు ఓ అధికారి.

తాను పనిచేస్తున్న ఊరు ఇలా ఉండకూడదనే ఓ అధికారి ఆలోచనకు ఉన్నతాధికారుల సహకారం తోడవడంతో ఆ డంపింగ్ యార్డు కాస్తా ఉద్యానవనంలా మారిపోయింది. ఇంతకీ ఆ ఊరు పేరేంటి అనుకుంటున్నారా…అదే బెలటలీలోని బెహ్త చంద్ గ్రామ్ పంచాయతీ.

నిత్యం దుర్వాసన,స్మశాన వాటికలా మారిన ఆ ఊరి పరిస్ధితి మార్చేందుకు హర్దాయ్ మేజిస్ట్రేట్ పుల్‌కిత్ ఖేర్ నడుం బిగించాడు. ఇందుకు స్ధానిక గ్రామ పంచాయతీ,ప్రజల తోడ్పాటుతో కొద్దిరోజుల్లోనే అద్భుతాన్ని చేసి చూపించాడు. జాతీయ ఉపాధి హామీ పథకం,ఫైనాన్స్ కమిషన్ ఫండ్స్‌తో క్లీన్ విలేజ్‌గా మార్చేశాడు.

ఎంతలా ఒకప్పుడు డంప్ యార్డులా ఉన్న ప్రదేశాన్ని టూరిస్ట్ ప్లేస్‌గా గతంలో అటువైపు వెళ్లాలంటే భయపడిన వారంతా ఇప్పుడు వాకింగ్‌కు వచ్చేలా చిల్డ్రన్స్‌ పార్క్‌గా మార్చేశాడు. దీంతో ఇప్పుడు సందర్శకుల తాకిడితో ఆ గ్రామ పంచాయతీ పేరు యూపీలో మార్మోగిపోతోంది. తాను పనిచేసిన చోటు ఇంత చెత్తలా ఉండకూడదని పట్టుదలతో ఉన్నతాధికారుల సహకారంతో పూర్తిగా మార్చేశానని చెప్పారు ఖేర్ . తొలుత స్వచ్ఛ భారత్‌ను చేపట్టి ఇక్కడి సరస్సు చుట్టూ వెయ్యి చెట్లను నాటించానని దీంతో ప్రజల్లో అవగాహన వచ్చి పరిశుభ్రత పాటించారని చెప్పారు. ప్రస్తుతం ఈ పార్కు టూరిస్ట్ స్పాట్‌గా మారడమే కాదు చిరు వర్తక వ్యాపారులకు మంచి గిరాకీ వస్తోందన్నారు.

గతంలో బెలటలి క్రైమ్‌కు కేరాఫ్గా ఉండేదని ఇక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలు భయబ్రాంతుల మధ్య జీవనం సాగించారని శైలేంద్ర శ్రీవాస్తవ అనే పోలీస్ అధికారి తెలిపారు. కానీ ప్రస్తుతం ఇందుకు పూర్తిభిన్నంగా వాతావరణం మారిపోయి ప్రశాంతంగా ఉందన్నారు.

amusement park complex that has helped reduced crime in the area and generated livelihoods for local people. UP : Dump Ground Turns Amusement park

- Advertisement -