టిక్ టాక్ ప్రేమ..ఇద్దరు పిల్లలతో జంప్

469
Tiktok
- Advertisement -

సోషల్ మీడియాలో టిక్ టాక్ యాప్ చాలా ట్రెండింగ్ లో ఉంది. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఈ టిక్ టాక్ అనే యాప్ ఉంటుంది. దేశ వ్యాప్తంగా యువత ఇప్పుడు టిక్ టాక్ మాయజాలంలో మునిగిపోయారు. పెద్దలు కూడా ఈ యాప్ మాయలో పడిపోయారు. టిక్ టాక్ పరిచయాల వల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలో ఓ యువతి టిక్ టాక్ లో పరిచయమైన మరో మహిళతో ప్రేమలో పడటం సంచలనంగా మారింది.

కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన అర్చన కొన్ని రోజులుగా టిక్ టాక్ వీడియోలు చేస్తుంది. ఇలా వీడియోలు చేస్తున్న క్రమంలో ఆమెకు బెంగుళూరుకు చెందిన అంజలి అనే యువతితో పరిచయం ఏర్పడింది. అంజలి టిక్ టాక్ లో మగ వేషధారణలో వీడియోలు చేస్తుంటుంది. ఆ వీడియోలు అర్చనకు నచ్చడంతో లైక్ కొట్టడంతో వీరిద్దరు ఫ్రెండ్స్ అయ్యారు. ఇలా కొంత కాలం సాగిన తర్వాత పరిచయం కాస్త ప్రేమగా మారింది. దీంతో ఇంట్లో ఎవరికి చెప్పకుండా భర్త, పిల్లలను వదిలి బెంగుళూరు పారిపోయింది. దీనిపై అర్చన తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో ఆమెను తిరిగి ఇంటికి చేర్చారు ఈ విషయం ఇప్పుడు ఏపీలో వైరల్ గా మారింది.

- Advertisement -