గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా మేడిపల్లి అర్బన్ ఫారెస్ట్‌లో భాగంగా మొక్కలు నాటారు సీఎస్ ఎస్కె జోషి. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఏపీ సీఎస్ నీలం సహని,స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి ,పిసిసిఎఫ్ శోభలకు గ్రీన్ ఛాలెంజ్ ఇచ్చారు జోషి.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఇవాళ మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర గుప్తా తనకు గ్రీన్ ఛాలెంజ్ విసిరారని తాను మరో ముగ్గురికి ఛాలెంజ్ ఇచ్చానని తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటడం ద్వారా మనకు సరిపోయే అక్షిజన్ ఇస్తాయని చెప్పారు. హరితహారం ప్రాధాన్యతను అందరూ గుర్తించాలి ప్రతి ఒక్కరు హరితహారం లో పాల్గొని పర్యావరణంను కాపాడాలి అన్నారు.
తాను ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మొక్కలు నాటిన సీఎస్ ఎస్కే జోషికి ధన్యవాదాలు తెలిపారు. గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఇవ్వాళ మేడిపల్లి లో మొక్కలు నాటడం సంతోషంగా ఉందని…ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ ఉద్యమంలా కొనసాగుతోందన్నారు. సంతోష్ జన్మదినం రోజు మొక్కలు నాటడం మర్చిపోలేనని…ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆయనకు బర్త్ డే గిఫ్ట్ ఇవ్వాలన్నారు.
telangana cs sk joshi accepts green challenge…on mp santhosh kumar birthday.telangana cs sk joshi accepts green challenge…on mp santhosh kumar birthday.