భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు: కిషన్ రావు

300
kishanrao
- Advertisement -

ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ లో యాదాద్రి ఆలయం పై అపోహలు జరిగాయి అని రాశారు ఇది పూర్తి అవాస్తవం..దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు యాదాద్రి ఆలయ ప్రత్యేక అధికారి కిషన్ రావు. టూరిజం ప్లాజాలో యాదాద్రి ఆలయంపై మీడియాతో మాట్లాడిన ఆయన ఆలయంలో 750 ఎకరాల్లో కాటేజీలు నిర్మాణం చేస్తున్నాం…అన్ని రకాల పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ప్లాట్ లు దాతలకు ఇస్తాం త్వరలోనే.ప్లాట్స్ ధరలు నిర్ణయం చేశాం.దాతలకు మేమే కట్టిస్తాం తిరుపతి దేవస్థానం లో మాదిరిగా ఇక్కడ నిర్మాణం చేస్తున్నాం అన్నారు.పురాణ దేవాలయం లో దాన్ని మేము అభివృద్ధి చేస్తున్నాం…సీఎం కేసీఆర్ మహా యజ్ఞం చేయాలని నిర్ణయించారని చెప్పారు.

ఇలాంటి దేవాలయం వెయ్యి సంవత్సరాల తరువాత చరిత్రలో నిలుస్తోంది.. రాతి కట్టడం తో కట్టిన దేవాలయం…వార్తలు రాసేటప్పుడు వాస్తవాలు తెలుసుకొని రాయండన్నారు. భక్తుల మనోభావాలు దెబ్బతీయవద్దు…ప్రతి ఒక్కరు ఇంత పెద్ద దేవాలయంను పొగుడుతున్నారని చెప్పారు.

తాను 50 సంవత్సరాల నుండి స్వామికి సేవ చేస్తున్నానని తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథీగల్‌ లక్ష్మీనరసింహాచార్యులు. గతంలో ఎప్పుడు కూడా దేవాలయం అభివృద్ధి గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ సీఎం కేసీఆర్ యాదాద్రి గుట్టను అభివృద్ధి చేయాలని నిర్ణయించారని చెప్పారు. తనకు 30 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్‌ తెలుసన్నారు. ఆంధ్రజ్యోతి తాను రాసిన వార్త ద్వారా కోట్ల భక్తులను కించపర్చారు..ఆంధ్రజ్యోతి కథనం పూర్తి అవస్తావం అన్నారు.

భక్తి ప్రపూర్ణుడు లక్ష్మీ నర్సింహ స్వామి వారు,ఆయన అన్ని రూపాల్లో ఉన్నారు..స్వామి ఆతృత భక్తులను రక్షించాలి…లక్ష్మీ నర్సింహ స్వామి అన్నిరకాల లో కొలుస్తారు అమ్మవారు ఉంటే ఉగ్రమూర్తి అవుతారు,అమ్మవారు లేకపోతే శాంతి స్వరూపుడు అవుతారని చెప్పారు.

కొన్ని దశాబ్దాలుగా స్వామివారి కి సింధురం వెయ్యడం జరుగుతుంది. స్వామి వారిపై సింధురం పేరుకుపోయింది…ఆ సింధురాన్ని మేము తొలగించాం, స్వామి వారిని ఎవరిని తాకానియ్యం…మాకు ఎలాంటి విభేదాలు లేవు.బాలలయం లో మూర్తి ని మళ్ళీ గర్భాలయంలో కి తెస్తాం అన్నారు.

చిన జీయర్ స్వామి మా మతాచార్యులు ఆయన చెప్పినవి మేము ఆచారిస్తాం….దేవాలయం నాలుగుపైవుల మాడ వీధులు నిర్మాణం చేస్తున్నాం అన్నారు. జనవరి చివరి నాటికి ప్రధాన ఆలయం పనులు పూర్తి అవుతాయన్నారు.

kishanrao on yadadri development…kishanrao on yadadri development…kishanrao on yadadri development

- Advertisement -