పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదల

454
10th Exams
- Advertisement -

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల తేదీలను ప్రకటించింది ప్రభుత్వం . 2020మార్చి 19నుంచి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఎస్‌ఎస్‌సీ రెగ్యులర్, ప్రైవేటు, ఒకేషనల్, ఓఎస్‌ఎస్‌సీ విద్యార్థులకు ఈ టైం టేబుల్‌ వర్తిస్తుందని తెలిపింది. పరీక్షలు ప్రతి రోజు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై, మధ్యాహ్నం 12:15 గంట ల వరకు కొనసాగుతాయని పే ర్కొంది.

ద్వితీయ భాష పరీక్ష, ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపరు–2 పరీక్షలు మాత్రం ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంట ల వరకు జరుగనున్నాయి. అలాగే కాంపోజిట్‌ కోర్సు ప్ర థమ భాష పేపర్‌–2 పరీక్ష 10:45 గంటల వరకు, ఎస్‌ఎస్‌సీ ఒకేషనల్‌ కోర్సు పరీక్ష 11:30 గంటల వరకు కొనసాగుతాయని వివరించింది.

10-th

- Advertisement -