‘కమ్మరాజ్యంలో కడపరెడ్లు’ మూవీకి సెన్సార్ నిరాకరణ

489
KammaRajyamlo Kadapareddlu
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో కమ్మరాజ్యంలో కడపరెడ్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే విడుదలకు ముందే ఈసినిమా ఎన్నో వివాదాలను సృష్టించింది. ఈసినిమాకు సంబంధించిన మూడు పాటలను ఇప్పటికే విడుదల చేశారు. అయితే ఇటివలే సినిమా టైటిల్ మార్పుతో షాక్ ఇచ్చింది కోర్టు. అంతలోనే కొత్త టైటిల్ గా అమ్మరాజ్యంలో కడపబిడ్డలు ను ఖరారు చేశారు.

తాజాగా సెస్సార్ బోర్డు కూడా ఈసినిమా యూనిట్ కు షాక్ ఇచ్చింది. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సెన్సార్ బోర్డు సభ్యులు నిరాకరించారు. ఈరోజు ఈసినిమాను వీక్షించిన సెన్సార్ బోర్డు సభ్యులు అనుమతి నిరాకరించినట్లు తెలిపారు. ఈమూవీలో కొంత మందిని టార్గెట్ చేస్తూ అసభ్యకరమైన సన్నివేశాలు ఉండటంతో సర్టిఫికేట్ ఇవ్వలేమమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో, రివైజింగ్ కమిటీకి వెళ్లాలని చిత్ర నిర్మాతలు నిర్ణయించారు. ఈవిషయంపై వర్మ ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.

- Advertisement -