తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం మొత్తం సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి ఘటనపై అగ్రనటుడు చిరంజీవి స్పందించారు. అత్యాచారాలు హత్యలు చూసి గుండె తరుక్కుపోతుందన్నారు. ఆడపిల్లల పట్ల నీచంగా వ్యవహరించే ఉన్మాదుల పట్ల శిక్షలు చాలా కఠినంగా ఉండాలన్నారు. “గత రెండు మూడు రోజులుగా ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాలు హత్యలు.. ఇవన్నీ వింటుంటే గుండె తరుక్కుపోతుంది.
ఈ దేశంలో ఆడపిల్లలకు భద్రత లేదనే భావం కలుగుతోంది. మగ మృగాల మధ్యా మనం బ్రతుకుతోందని అనిపిస్తుంది. మనసు కలచివేసే ఈ సంఘటనల గురించి ఒక అన్నగా, ఒక తండ్రిగా స్పందిస్తున్నాను. ఇలాంటి నేరాలు చేసిన దుర్మార్గులకు శిక్షలు చాల కఠినంగా ఉండాలి. భయం కలిగించేలా ఉండాలి. నడిరోడ్డు మీద ఉరి తీసినా తప్పు లేదు. త్వరగా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయమే. అలాగే త్వరితగతిన శిక్ష పడేలా చూడాలి, అప్పుడే ఇలాంటి నేరాలు చేయాలంటే ఎవరైనా భయపడతారు.
ఆడపిల్లలందరికీ నేను చెప్పేదొక్కటే… మీ ఫోన్లలో 100 నంబర్ ను స్టోర్ చేసుకోండి. అలాగే మీ స్మార్ట్ ఫోన్లలో హాక్ ఐ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. ఒక్క బజర్ నొక్కితే చాలు షీ టీమ్స్ వెంటనే స్పందిస్తాయి. పోలీసు విభాగం సేవలను, వారి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోండి. మహిళలకు రక్షణ కల్పించడం, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత” అంటూ చిరంజీవి ఓ వీడియోలో తన సందేశం వినిపించారు.
Chiranjeevi garu talks about the unfortunate Priyanka Reddy incident. #RIPPriyankaReddy pic.twitter.com/WJO9xZzqvj
— Vamsi Kaka (@vamsikaka) November 30, 2019