డేవిడ్ వార్నర్…ట్రిపుల్ సెంచరీ

549
david warner
- Advertisement -

ఆడిలైడ్ వేదికగా పాకిస్ధాన్‌తో జరుగుతున్న రెండవ టెస్టు మ్యాచ్‌లో ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ త్రిబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తన బ్యాట్‌కు పనిచెప్పిన వార్నర్…పాక్ బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్నాడు. వార్నర్ ధాటికి పాక్ బౌలర్లు చేతులెత్తేశారు. ప్రస్తుతం వార్నర్ 315 పరుగులతో మాథ్యు వేడ్ 29 పరుగులతో క్రీజులో ఉన్నారు.

401 బంతుల్లో 38 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో వార్నర్ 315 పరుగులతో క్రీజులో ఉండగా ఆసీస్ కేవలం 3 వికెట్లు మాత్రమే కొల్పోయి 560 పరుగులు చేసింది.

ఇక టెస్టు క్రికెట్‌లో అతిత్వ‌ర‌గా ఏడు వేల ప‌రుగులు చేసిన క్రికెట‌ర్‌గా స్టీవ్ స్మిత్ రికార్డు క్రియేట్ చేశాడు. కేవ‌లం 70 మ్యాచుల్లోనే స్టీవ్ స్మిత్ ఈ ఘ‌న‌త‌ను అందుకున్నాడు. గ‌తంలో ఈ రికార్డు విండీస్ క్రికెట‌ర్ స‌ర్ గారీఫీల్డ్ సోబ‌ర్స్ పేరిట ఉన్న‌ది. అత‌నిక‌న్నా 9 మ్యాచ్‌లు ముందుగానే స్మిత్ ఈ రికార్డును అందుకున్నారు.

- Advertisement -