- Advertisement -
వెటర్నరీ వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య బాధాకరం అన్నారు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ. ఈరోజు సాయంత్రం మంత్రి ప్రియాంకరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు హోంమంత్రి సైబరాబాద్ సీపీ సజ్జనార్. ఈసందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ…ప్రియాంక కేసును పోలీసులు సీరియస్ గా తీసుకున్నారని చెప్పారు.
కేసును ఫాస్ట్‌ట్రాక్ కోర్టుకు అప్పగిస్తామన్నారు. నిందితులకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. ఎవరు ప్రమాదంలో ఉన్నా డయల్ 100 నంబర్‌కు ఫోన్ చేయాల్సిందిగా సూచించారు. ఫోన్ వచ్చిన 3 నిమిషాలలోపే పోలీసులు స్పందిస్తారని హోంమంత్రి పేర్కొన్నారు. ప్రియాంక కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు.
- Advertisement -