ప్రియాంక హత్య కేసులో నిందితుల అరెస్ట్

421
priyanka
- Advertisement -

వెటర్నరి వైద్యురాలు ప్రియాంక రెడ్డి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రియాంక రెడ్డిని అత్యంత దారుణంగా హత్య చేసి పెట్రోల్ తో సజీవ దహనం చేశారు దుండగులు. అయితే ఈకేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. మొత్తం 10బృందాలుగా విడిపోయి కేసు చేధింస్తున్నారు. తాజాగా ఈకేసుకు సంబంధించిన నిందితులు 4గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 pasha-gang

టోల్ ప్లాజా వెనకాల ఉన్న ఖాళీ ప్రదేశంలోకి ఆమెను తీసుకెళ్లిన నిందితులు అక్కడే అత్యాచారం చేశారని.. ఆ తరువాత శరీరానికి దుప్పటి చుట్టి కిరోసిన్‌తో కాల్చి చంపారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. కాసేపట్లో వీరిని మీడియా ముందుకు తీసుకురానున్నారు. నిందితులు మొత్తం మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు. వారిలో మహ్మద్ పాషా అనే వ్యక్తి నారాయణ పేట్ మండలం మహబూబ్‌నగర్ వాసి ఒకడు కాగా.. అతడిపై గతంలోనూ కేసులు ఉన్నట్లు సమాచారం. మరోవైపు లారీ రాజేంద్రనగర్‌కు చెందిన పటోళ్ల శ్రీనివాస్ రెడ్డిదిగా గుర్తించారు.

- Advertisement -