తెలంగాణలో ఆర్టీసీ సమస్యకు ముగింపు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని సీఎం కేసీఆర్ అన్నారు. కార్మికులందరూ రేపు విధుల్లో చేరండని కేసీఆర్ తీపికబురు అందించారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది. ఈ రోజు కేసీఆర్ ఆధ్వర్యంలో కేబినేట్ సమావేశం జరిగింది. భేటీ అనంతరం మీడియాతో సమావేశమై వివరాలను వెల్లడించారు. విపక్షాలు కార్మికులకు లేని ఆశలు కల్పించారని విమర్శించారు. ఆర్టీసీ విషయంలో లేబర్ కోర్టు మాకు ఇంకా సమయం ఇచ్చిందన్నారు. రాజకీయ నిరుద్యోగుల ఆర్టీసీ సమ్మె విషయంలో హంగామా సృష్టించారు. కార్మికులు యూనియన్ల మాటలు నమ్మాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక ప్రజల పొట్టలు నింపామే తప్ప ఎవరి పొట్టా కొట్టలేదని కేసీఆర్ అన్నారు.
ఆర్టీసీకి తక్షణ సాయం కింద రేపు ఉదయంలోపు రూ.100 కోట్లు ఇస్తాం. ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరేందుకు ఎలాంటి కండిషన్లు పెట్టం. సమ్మె కాలంలో మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకుంటాం. చనిపోయిన వారి కుటుంబంలో ఒకరి ఉద్యోగం ఇస్తున్నం. ఆర్టీసీ సంస్థ బతకాలి. ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలే. ఆర్టీసీ కార్మికులను యాజమాన్యం వేధించకుండా చూస్తాం. కార్మికులను కాదని మేం ఏ నిర్ణయం తీసుకోమని సీఎం తెలిపారు.
పెట్టుబడిదారులకు ఆర్టీసీని ఇవ్వదర్చుకోలేదు క్రమశిక్షణరాహిత్యంగా వ్యవహరిస్తే ఊరుకోం. తెలంగాణ బిడ్డగా కార్మికుల జీవితాలు కాపాడే బాధ్యత నాపై ఉంది. వచ్చే వారంలోగా ప్రతి డిపో నుంచి కార్మికులను పిలిచి మాట్లాడుతా. యూనియన్లను సంప్రదించే ప్రసక్తే లేదు. ఇప్పటికైనా కార్మికులు నిజం తెలుసుకోవాలి. కి.మీ 20పైసలు చొప్పున బస్సు చార్జీలు పెంచుతామని సీఎం తెలిపారు. దీంతో దాదాపు రెండు నెలలు కొనసాగిస్తున్న కార్మికుల సమ్మెకు చరమ గీతం పాడినట్లైంది.
అలాగే రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తులపై సీఎం కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సంవత్సరం వర్షాలు బాగా కురిసినయి. వర్షాలకు రోడ్లు బాగా దెబ్బతిన్నాయి. ఆర్ అండ్ బీ అధికారులు, చీఫ్ ఇంజినీర్లను పిలిచి రోడ్ల గురించి మాట్లాడినం. పాడైన జాతీయరహదారులను పట్టించుకునే నాథుడే ఉండరు. నేషనల్ హైవేలపై కనీస నిర్వహణ ఉండదు. రాష్ట్రంలోని హైవేలు, ఇతర రోడ్లను రెండు మూడు నెలల్లో మరమ్మతులు చేస్తం. రోడ్ల మరమ్మతులకు రూ.571 కోట్లు వెంటనే మంజూరు చేశామని తెలిపారు.
The TRS government has raised the RTC fares announced chief Minister KCR . The chief minister KCR addressed a press meet here and gave an allocation..