ఎట్టకేలకు మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడి సంకీర్ణ సర్కార్ కొలువుదీరేందుకు మరికొద్ది గంటలు మాత్రమే మిగిలిఉంది. శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయనుండగా సీఎంగా శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సాయంత్రం 6.40 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదార్‌లోని ప్రఖ్యాత శివాజీ పార్కులో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి.
ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల సీఎంలతో పాటు మహారాష్ట్రకు చెందిన 400 మంది రైతులతో పాటు ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబసభ్యులు హాజరుకానున్నారు. వీరికి ఇప్పటికే ఆహ్వానాలు పంపారు.
ఇక కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, పశ్చిమబెంగాల్, ఢిల్లీ ముఖ్యమంత్రులు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ హాజరుకానున్నారు. ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాక్రే కూడా హాజరుకానున్నారు. ఇక ప్రత్యర్ధి శిబిరంలోకి వెళ్లి తిరిగి ఎన్సీపీలోకి వచ్చిన అజిత్ పవార్‌కు మళ్లీ డిప్యూటీ సీఎం పదవి దక్కే అవకాశం ఉంది.
The stage is set for the swearing off Uddhav Thackeray as the CM of Maharashtra. AICC Chief Sonia Gandhi has been invited for the swearing-in apart from Kejriwal.