భారత రాజ్యాంగాన్ని అమోదించి 70 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేకంగా సమావేశం కానున్నాయి. రాజ్యసభ 250వ సమావేశాలకు గుర్తుగా రూపొందిన రూ. 250 విలువైన వెండి నాణేన్ని రాష్ట్రపతి రామ్ నాథ్,ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించనున్నారు.
ఉదయం 11 గంటలకి పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోడీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ప్రసంగించనున్నారు. ఇప్పటివరకు జరిగిన 103 రాజ్యంగ సవరణలకు సంబంధించిన వివరాలను పుస్తకం రూపం విడుదల చేయనున్నారు. రాజ్యసభ: ద జర్నీ సిన్స్ 1952 శీర్షికన దీనిని సిద్ధం చేశారు.
బాబూ రాజేంద్ర ప్రసాద్ నాయకత్వంలో 1946లో రాజ్యాంగ పరిషత్ ఏర్పాటయ్యింది. రాజ్యాంగాన్ని 13 అంశాలతో సమగ్రంగా రూపొందించాలని నిర్ణయించారు. వీటికోసం 13 కమిటీలు ఏర్పడ్డాయి. రాజేంద్రప్రసాద్తోపాటుగా బాబా సాహెబ్ అంబేద్కర్, సర్దార్ వల్లభాయ్ పటేల్, జె.బి.కృపలానీ, వరదాచారి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, భోగరాజు పట్టాభిసీతారామయ్య, కె.ఎం.మున్షీ, జి.వి.మౌల్వాంకర్, గోపీనాథ్ బోర్డోలాయ్ వంటివారు మొత్తం 13 కమిటీలకు సారథ్యం వహించారు. రాజ్యాంగ ముసాయిదాపై 1949 నవంబర్ 26న పరిషత్ సభ్యులు సంతకాలు చేశారు.
The yearlong nationwide activities on Constitution Day are being launched to mark the 70th anniversary of the adoption of the Indian Constitution by the Constituent Assembly, beginning November 26, 2019