- Advertisement -
1980ల నాటి తారలంతా `క్లాస్ ఆఫ్ ఎయిటీస్` పేరుతో ప్రతియేటా వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. గతంలో రకరకాల ప్రదేశాల్లో ఈ మీటింగ్ పార్టీ చేసుకున్నారు. ఈసారి పదో వార్షికోత్సవ పార్టీ కావడంతో ఈ ఏడాది మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడమే గాక.. ఆయనే హోస్టింగ్ చేయడం మరింత ఆసక్తికరంగా మారింది హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని మెగాస్టార్ చిరంజీవి స్వగృహంలో నిర్వహించారు.
ఈ రీయూనియన్ మీట్ లో ఈసారి 1980-1990లో అగ్ర తారలు పాల్గొన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ – కోలీవుడ్ సహా మలయాళం.. కన్నడం నుంచి మొత్తం 40 మంది తారలు ఈ వేడుకకు హాజరయ్యారు.
గత తొమ్మిదేళ్లుగా ఈ వేడుకలు విజయవంతంగా జరుగుతున్నాయి. పదో సారి కావడంతో ఘనంగా మెగాస్టార్ ఈ వేడుకల్ని స్వయంగా నిర్వహించారు.
- Advertisement -