ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌కు అపూర్వ స్పందన వస్తోంది. రాజకీయ నేతలతో పాటు కళాకారులు, సామాజిక వేత్తలు గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి.. మొక్కలను నాటుతున్నారు.
తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు యాంకర్ బిత్తిరి సత్తి అలియాస్ రవికుమార్. రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్ ఇచ్చిన చాలెంజ్ స్వీకరించి మూడు మొక్కలు నాటారు సత్తి.
ఈ సందర్భంగా మాట్లాడిన బిత్తిరి సత్తి రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం ని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు మొక్కలను నాటాలని అదేవిధంగా వాటిని సంరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని తెలిపారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ ఒక గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు అని కొనియాడారు. ఈ సందర్భంగా మరొక నలుగురిని హాస్య నటుడు బ్రహ్మానందం, కల్వకుంట్ల హిమాన్షు రావు,ప్రియా దర్శిని,తీన్ మార్ శివ జ్యోతి లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.
గ్రీన్ ఛాలెంజ్‌లో భాగంగా ఇప్పటివరకు 3 కోట్లకు పైగా మొక్కలు నాటారు. సినీ, రాజకీయ, క్రీడా, దేశ, విదేశాలకు చెందిన పలువురు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతున్నారు.
Anchor Bithiri sathi alias ravi kumar accepts green challenge..Anchor Bithiri sathi alias ravi kumar accepts green challenge..