టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు ఎంపీ సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ గొప్ప కార్యక్రమం అన్నారు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ . ఎంపీ సంతోష్ పై ప్రశంసల వర్షం కురిపించిన ఆయన ఎంపీ బండా ప్రకాశ్ ఇచ్చిన గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
గ్రీన్ ఛాలెంజ్ కు సంబంధించిన వివరాల బ్రోచర్ ను బండా ప్రకాశ్… హరివంశ్ నారాయణ్ కు అందజేశారు.ఒక్కరు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటమని పిలుపునివ్వడం గొప్ప పర్యావరణహితకార కార్యక్రమన్నారు హరివంశ్.
దేశంలోని ప్రతి ఒక్కరూ గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యం కావాలని హరివంశ్ పిలుపునిచ్చారు.కాలుష్య నివారణకు, స్వచ్ఛమైన ఆక్సిజన్ ఉత్పత్తికి గ్రీన్ ఛాలెంజ్ ఎంతో దోహదపడుతుందన్నారు.
Harivansh Narayan Singh (born 30 June 1956) is an Indian journalist and politician, who is the current Deputy Chairman of the Rajya Sabha, the upper house of the Indian Parliament.