బంగారం ధరలు తగ్గడం పసిడి ప్రేమికులకు ఊరటనిస్తోంది. సరిగ్గా మూడు నెలల క్రితం రూ.40వేలకు చేరిన 10గ్రాముల బంగారం ధర, గత 3 నెలల్లో ఏకంగా రూ.2 వేలు పడిపోయింది. ఇదిలా ఉంటే సెప్టెంబర్ ఆరంభంలో బంగారం రూ.50 వేలు పైకి చేరుతుందని అంతా అంచనా వేశారు. అయితే బంగారం ధర ప్రస్తుతం భారీగా పడిపోయింది.
హైదరాబాద్ మార్కెట్లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 దిగొచ్చింది. దీంతో ధర రూ.39,860కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలమైన ట్రెండ్ ఉన్నా కూడా దేశీ జువెలర్ల, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ మందగించడం బంగారం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
అదేసమయంలో 10 గ్రాముల 22 కార్యెట్ల బంగార ధర కూడా రూ.40 తగ్గింది. దీంతో ధర రూ.36,540కు క్షీణించింది. ఇకపోతే బంగారం ధర బాటలోనే వెండి కూడా నడిచింది. ఏకంగా రూ.965 పతనమైంది. దీంతో కేజీ వెండి ధర రూ.46,900కు దిగొచ్చింది.
ఢిల్లీ మార్కెట్లో కూడా బంగారం ధర తగ్గింది. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50 తగ్గుదలతో రూ.38,500కు చేరింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 క్షీణతతో రూ.37,300కు తగ్గింది. బంగారం ధర బాటలోనే వెండి ధర కూడా నడిచింది. కేజీ వెండి ధర రూ.965 తగ్గింది. దీంతో ధర రూ.46,900కు పడిపోయింది.
వివిధ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.39,860, విశాఖపట్నంలో రూ.39,570, ప్రొద్దుటూరులో రూ.39,000, చెన్నైలో రూ.38,250గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.36,540, విశాఖపట్నంలో రూ.36,400, ప్రొద్దుటూరులో రూ.36,120, చెన్నైలో రూ.36,640గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.44,800, విశాఖపట్నంలో రూ.46,100, ప్రొద్దుటూరులో రూ.46,200, చెన్నైలో రూ.48,600 వద్ద ముగిసింది.
Gold Rate in Hyderabad Today (21th Nov 2019): Get 22 Carat & 24 Karat gold rate in Hyderabad & last 10 days gold price based on rupees per gram from …