కమ్మరాజ్యంలో కడపరెడ్లు సెకండ్ ట్రైలర్..

648
krkr
- Advertisement -

వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ తెరకెక్కిస్తున్న చిత్రం కమ్మరాజ్యంలో కడపరెడ్లు. విడుదలకు ముందే ఈచిత్రం ఏపీ రాజకీయాల్లో వివాదస్పదంగా మారింది. ఏపీలోని ప్రస్తుత రాజకీయ పరిస్ధితులపై ఈసినిమాను తెరకెక్కించారు. కాగా ఈచిత్రంనుంచి ట్రైలర్ , టీజర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. కాగా గతంలో ఈ సినిమాకు సంబందించి ఓ ట్రైలర్ విడుదల చేసిన వర్మ తాజాగా మరో ట్రైలర్‌ను విడుదల చేశాడు.

తాజాగా విడుదలైన ట్రైలర్‌ పోస్టర్‌లో వర్మ పప్పులాంటి అబ్బాయి, అతని తండ్రి ఆటో నడుపుతున్నట్లు చూపించగా.. ట్రైలర్‌లో మాత్రం దానికి సంబందించి ఏమి చూపించలేదు. ఇక ఈ ట్రైలర్‌లో అలీ, బ్రహ్మానందం, యాంకర్ స్వప్న, కత్తి మహేష్‌లు కీలకపాత్రల్లో కనిపిస్తున్నారు. కాగా ఈ చిత్రానికి వర్మ శిష్యుడు సిద్ధార్థ తాతోలు దర్శకత్వం వహిస్తుండగా.. వర్మ రచన, సహ దర్శకత్వం వహించారు . ఇక ఈ సినిమాను ఈ నెల 21న విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు వర్మ.

kamma rajyamlo kadapa redlu second trailer released

- Advertisement -