మంత్రి సత్యవతిని ఇంటర్వూ చేసిన కేటీఆర్ తనయుడు హిమాన్షు

648
Kalvakuntal Himanshu
- Advertisement -

కేసీఆర్ మనువడు కల్వకుంట్ల హిమాన్షు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ ను ఇంటర్వూ చేశాడు. స్కూల్ ప్రాజెక్ట్ విషయమై మంత్రిని ఇంటర్వూ చేసినట్లు తెలిపాడు హిమాన్షు. ఈసందర్భంగా మంత్రిని పలు విషయాలు అడిగి తెలుసుకున్నాడు.

ఈ ఇంటర్వూకి సంబంధించిన విషయాలను తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశాడు హిమాన్షు. నా స్కూల్ ప్రాజెక్ట కోసం రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాధోడ్ ను ఇంటర్వూ చేసి పలు విషయాల గురించి తెలుసుకున్నట్లు తెలిపాడు. కాగా హిమాన్షు హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్కూల్ లో పదవ తరగతి చదువుతున్నాడు. ఇక హిమాన్షు సామాజిక సేవా  కార్యక్రమాల్లో కూడా  చురుగ్గా పాల్గొంటాడన్న సంగతి తెలిసిందే. ఇటివలే కేటీఆర్ పుట్టిన రోజున తండ్రి పేరుతో పేదలకు అన్నదానం చేసి తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నాడు.

- Advertisement -