టీ20 సిరీస్‌లో కీలకంగా మారిన నాగపూర్ టీ20లో భారత్ విజేతగా నిలిచింది.ఇటు బ్యాటింగ్‌లోనూ,అటు బౌలింగ్‌లోనూ రాణించి బంగ్లాను చిత్తుచేసింది. భారత్ విధించిన 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా….144 పరుగులకే చాపచుట్టేసింది. భారత బౌలర్లలో దీపక్ చాహర్ ఏడు పరుగులకు ఆరు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు. ఆఖర్లో చాహర్ హ్యాట్రిక్ వికెట్లు తీసి టీమిండియా తరఫున టీ20ల్లో హ్యాట్రిక్ నమోదుచేసిన తొలి బౌలర్‌గా నిలిచాడు. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో గెలుపొంది సిరీస్‌ను కైవసం చేసుకుంది.
బంగ్లా బ్యాట్స్మెన్లలో మహ్మద్ నయిమ్ (81: 48 బంతుల్లో 10×4, 2×6) రాణించగా మిగితా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0), ఆపిప్ హుస్సేన్ (0),కెప్టెన్ మహ్మదుల్లా (8) పరుగులు చేశారు.
అంతకముందు టాస్ గెలిచిన బంగ్లాదేశ్…భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఓపెనర్లు రోహిత్,ధావన్ విఫలమైన శ్రేయాస్ అయ్యర్ (62: 33 బంతుల్లో 3×4, 5×6), కేఎల్ రాహుల్ (52: 35 బంతుల్లో 7×4) హాఫ్ సెంచరీలతో రాణించడంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. గురువారం నుంచి రెండు టెస్టుల సిరీస్ ప్రారంభంకానుంది.