నిమ్స్ డయాలసిస్ విభాగాన్ని సందర్శించారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి. అక్కడ రోగులకందుతున్న సేవలను నెఫ్రాలజీ విభాగం ప్రొఫెసర్ తాడూరి గంగాధర్ తో చర్చించారు .విభాగమంతా కలియ దిరిగి రోగుల తో ముచ్చటించారు .ఆలేరు లో నెలకొల్ప బోయే డయాలసిస్ సెంటర్ కు కావాల్సిన మౌళిక సదుపాయాల పై ప్రొఫెసర్ గంగాధర్ తో కూలంకషం గా మాట్లాడారు .డయాలసిస్ సెంటర్ కు కావలసిన పరికరాలు, సమకూర్చుకోవలసిన సామాగ్రి అందుకు అయ్యే ఖర్చు గురించి ఆమె సవివరంగా తెలుసుకున్నారు.
తన నియోజక వర్గం లో మెరుగైన డయాలసిస్ సేవలు అందేలా ప్రత్యేక చికిత్సా కేంద్రం స్థాపించాలని ఇప్పటికే నిర్ణయించుకున్నారు .ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనూ కిడ్నీ వ్యాధిగ్రస్తుల బాధలను తలచుకుని ఆమె కంట తడి పెట్టిన విషయం తెలిసిందే .ఆలేరు డయాలసిస్ సెంటర్ స్థాపన కు నిమ్స్ ఆస్పత్రి సందర్శన తో ముందడుగు పడిందని సునీత తెలిపారు .నిమ్స్ లో కిడ్నీ వ్యాధి బాధితులు తమకు పెన్షన్ మంజూరు ,బస్సు పాస్ సౌకర్యం కల్పించాలని ఆమెకు వినతి పత్రం సమర్పించారు .ఈ సమస్యలను ప్రభుత్వం ద్రుష్టి కి తీసుకెళ్తానని సునీత హామీ ఇచ్చారు .నిమ్స్ లో చికిత్స పొందుతున్న
బొమ్మల రామారం మండలం పేరారం గ్రామానికి చెందిన కిడ్నీ వ్యాధి గ్రస్థురాలు చిమ్ముల లలితను ఈ సందర్భంగా ఆమె పరామర్శించారు.