TSSPDCL కు ICC అవార్డులు

593
tsspdcl
- Advertisement -

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ కు ప్రతిష్టాత్మక ICC అవార్డులు దక్కాయి. ఈ రోజు న్యూ ఢిల్లీ లో జరిగిన ఇండియన్ ఛాంబర్ అఫ్ కామర్స్ వారు నిర్వహిచిన 13 వ ఇండియా ఎనర్జీ సమ్మిట్లో భాగంగా నిర్వహించిన ఒక కార్యక్రమంలో భాగంగా సుభాష్ చంద్ర గార్గ్, మాజీ సెక్రటరీ, కేంద్ర ఇంధన మంత్రిత్వ శాఖ చేతులమీదుగా సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ గౌరవరం రఘుమా రెడ్డి అందుకున్నారు.

దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థకు 1) ఓవరాల్ విన్నెర్: ఇన్నోవేషన్ విత్ ఇంపాక్ట్ అవార్డు 2019, 2 ) ఎఫిసియెంట్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్ అవార్డు 3) టెక్నాలజీ అడాప్షన్ అవార్డు 4) పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్మెంట్ అవార్డులు దక్కాయి.

tsspdcl 2

జి రఘుమా రెడ్డి సంస్థ సీఎండీ మాట్లాడుతూ.. విద్యుత్ పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి తన పరిధిలోని అన్ని కేటగిరీల వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా అందించటం, ఖచ్చితమైన విద్యుత్ బిల్లులు అందించటం కోసం IR/IRDA ఆధారిత విద్యుత్ మీటర్ల ఏర్పాటు, గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతం లో విద్యుత్ సరఫరా పర్యవేక్షణకు స్కేడా/ DMS / SASA వంటి అధునాతన పద్దతులను ప్రవేశబెట్టటం, విద్యుత్ నష్ఠాల తగ్గింపుతో పాటు, వినియోగదారుల సమస్యలను తీర్చటం లో సంస్థ అవలంభిస్తున్న వినూత్న పద్ధతులకు ఈ అవార్డులు దక్కాయన్నారు.

తమ సంస్థకు సౌర విద్యుత్ లో తమ సంస్థ చూపిన శ్రద్ధకు గాను భారత ప్రభుత్వం వారిచే జాతీయ పురస్కారం, IPPAI పురస్కారం, ICC అవార్డులు, స్కోచ్ అవార్డు వంటి వివిధ ప్రతిష్టాత్మక అవార్డులు లభించాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల ఫలితంగానే ఈ అవార్డులు దక్కాయన్నారు. సంస్థ ఉద్యోగులకు, విద్యుత్ వినియోగదారులకు అభినందనలు తెలిపిన సీఎండీ, మున్ముందు సైతం సమర్ధవంతం గా విధులు నిర్వహిస్తూ వినియోగదారులకు నాణ్యమైన నమ్మకమైన సేవలు అందిస్తూ ఇలాంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు మరెన్నో సాధిద్దామని ఆశాభావం వ్యక్తం చేసారు.

- Advertisement -