తహసీల్దార్ విజయారెడ్డి హత్యకేసులో నిందితుడు సురేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడని వస్తున్న వార్తలు వెలువడ్డ నేపథ్యంలో ఉస్మానియా హాస్పటల్ వైద్యులు క్లారిటీ ఇచ్చారు. సురేశ్ మృతిచెందినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఉస్మానియా హాస్పటల్ స్పష్టం చేసింది. ఆర్ఎంవో డాక్టర్ మొహమ్మద్ రఫీ ఈ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. నిందితుడు సురేశ్ బుధవారం రాత్రి నుంచి వెంటిలేటర్‌పై ఉన్నాడని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండడంతో.. ఇంకా వెంటిలేటర్‌పై కొనసాగుతున్నాడని రఫీ తెలిపారు.
విజయారెడ్డిపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. నిందితుడు సురేష్ నిన్న రాత్రి నుంచి వెంటిలేటర్‌పై ఉన్నాడని వైద్యులు తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు వైద్యులు మీడియా సమావేశం నిర్వహించి దీనిపై స్పష్టత ఇవ్వనున్నారు. కాగా సురేశ్ చికిత్స పొందుతున్న వార్డు వద్ద అతని భార్య ఇవాళ ఉదయం స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను క్యాజువాల్టీ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు.