విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేష్‌ మృతి!

568
mro vijay
- Advertisement -

అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్య కేసులో నిందితుడు సురేశ్‌ ఈ రోజు మృతి చెందాడు. ఆమెపై పెట్రోల్ పోసి తగులబెట్టిన ఘటనలో అతడు కూడా తీవ్ర గాయాలపాలైన విషయం తెలిసిందే. రాష్ట్ర‌వ్యాప్తంగా ఈ సంఘ‌ట‌న సంచ‌ల‌నం రేపింది.

సుమారు 60 శాతం కాలిన గాయాల‌తో పోలీస్ స్టేష‌న్‌కు చేరిన సురేష్‌ను ఉస్మానియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ముఖం, ఛాతీ కాలిపోవటంతో అతడు చికిత్సకు స్పందించలేదని సమాచారం. హాస్ప‌ట‌ల్లో నాలుగు రోజులుగా కొన‌ప్రాణాల‌తో కొట్టుమిట్టాడిన సురేష్‌.. ఇవాళ తుదిశ్వాస విడిచాడు. కాసేపట్లో అతడి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించనున్నారు.

విజ‌యారెడ్డిని హ‌త్య చేసిన ఘ‌ట‌న గురించి సురేష్‌ నుంచి పోలీసులు ఎటువంటి స‌మాచారం సేక‌రించార‌న్న విష‌యం ఇంకా స్ప‌ష్టంగా తెలియ‌దు. దేనివ‌ల్ల విజ‌యారెడ్డిని హ‌త్య చేశాడ‌న్న కోణంలో సురేష్‌ నుంచి వాంగ్మూలం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఓ భూమికి సంబంధించి పట్టా ఇవ్వలేదనే ఆగ్రహంతోనే తాను ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు సురేష్‌ వాంగ్మూలం ఇచ్చాడు. అలాగే తనపై తానే పెట్రోల్ పోసుకున్నట్లు చెప్పాడు. సురేష్‌ మృతి చెందిన‌ట్లు అత‌ని కుటుంబ‌స‌భ్యుల‌కు వైద్యులు తెలిపిన‌ట్లు స‌మాచారం.

- Advertisement -