ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చే బాధ్యత మాదే

474
JagadishReddy
- Advertisement -

రాష్ట్రంలో ప్రతి ఎకరానికి సాగునీరు అందించే బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు విద్యాశాఖ మంత్రి గుంతకండ్ల జగదీశ్వర్ రెడ్డి. తుంగతుర్తి నియోజకవర్గం నాగారం మండలం ఫణిగిరి,నాగారం గ్రామాల నుంచి వెళ్తున్న SRSP DBM 70 కాలువలు గోదావరి జలాలను పరిశీలించారు మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్.

ఈసందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు ప్రతి క్షణం అధికారులతో కలిసి కాలువల పై కలియతిరిగి ఎక్కడెక్కడ ఎలాంటి ఇబ్బందులు ఉన్న మా దృష్టికి తీసుకురావాలని సూచించారు. సాగునీటి విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళనలు వద్దు ఇంకా మూడు నెలలు నీళ్లు ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

ప్రతి కుంట,ప్రతి చెరువు నింపుతాం,ప్రతి పిల్ల కాలువ కూడా నీళ్లు పారిస్తామని చెప్పారు. SRSP కాలువలపై మాకు ఎదురైతున్న సమస్యలన్నింటిని వచ్చే వేసవి కాలం వరకు శాశ్వతమైన పరిష్కారం చేస్తాం. కాళేశ్వరం గోదావరి జలాలతో సూర్యాపేట జిల్లా,తుంగతుర్తి నియోజకవర్గంలో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తామని చెప్పారు.

- Advertisement -