బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. ఈషో ఎంత పెద్ద హిట్ అయిందో అదే స్ధాయిలో వివాదాలు కూడా ఎదుర్కొంటుంది. బిగ్ బాస్ 3 ప్రారంభంముందు ఈ షోపై చాలా మంది కామెంట్లు చేశారు. అయితే ఈషో ముగిసిన తర్వాత కూడా వివాదాలను ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 3 విన్నర్ గా రాహుల్ సిప్లిగంజ్ నిలిచాడు. బిగ్ బాస్ టైటిల్ తానే గెలుస్తానని అనుకున్న శ్రీముఖి కి రన్నరప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తాజాగా బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేశారు యాంకర్ ఝాన్సీ. .
బిగ్ బాస్ నిర్వాహకులు మహిళలను గెలిపించడానికి సిద్దంగా లేరని అభిప్రాయపడింది. అమెరికా వంటి దేశంలోనే మహిళను అధ్యక్షురాలిని చేయాలనుకోవటం లేదు. అలాంటిది తెలుగు ప్రేక్షకులు మాత్రం బిగ్‌బాస్ విన్నర్‌గా మహిళను ఎందుకు గెలిపిస్తారు?’ అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించింది. బిగ్‌బాస్ హౌస్‌లో శ్రీముఖి తన బెస్ట్ ఇచ్చిందని ఝాన్సీ ప్రశంసలు కురిపించింది. కాగా ఇంత వరకు జరిగిన మూడు సీజన్లలో బిగ్ బాస్ టైటిల్ అబ్బాయిలకే రావడం పట్ల కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Perfectly put 👌👌👌
Such lovely words by Jhansi garu 😍#BiggBossTelugu3#SreeMukhiDeservesTheTitle#LoveYouSreemukhi pic.twitter.com/FY6S9EtvGj— Monica (@M_o_n_1_c_a) November 4, 2019