ఫర్జీ కేఫ్..ఫర్జికేషన్ వేడుకలు

552
ferzi cafe
- Advertisement -

ఆధునిక భారతీయ బిస్ట్రో ఫర్జీకేఫ్ తమ రెండవ వార్షికోత్సవ వేడుకలను నెల రోజుల పాటు ఉత్సాహపూరితమైన ఆఫర్లు, ప్రతిష్టాత్మక ప్రదర్శనలు మరియు కార్యక్రమాలతో తమ అతిథులను స్వాగతిస్తూ చేయబోతుంది. ఈ రెస్టారెంట్ ప్రారంభమైన నాటి నుండి ఆతిథ్య రంగంలో నూతన ప్రమాణాలను విజయవంతంగా ఏర్పాటుచేయడంతో పాటుగా నగరంలో ఎఫ్ అండ్ బీ ఆఫరింగ్ స్థాయిని గణనీయంగా వృద్ధి చేసింది.

ఫర్జీ కేఫ్ హైదరాబాద్, నగరంలో తమ స్థానాన్ని సుప్రసిద్ధ ఎఫ్ అండ్ బీ కేంద్రంగా నిలుపుకోవడంతో పాటుగా ఈ ప్రాంతంలోని సెలబ్రిటీలకు, వ్యాపారవేత్తలకు, డీజె మరియు సోషలైట్లకు అభిమాన కేంద్రంగా నిలిచింది. ఈ ఆతిథ్య కేంద్రం తమ అద్భుతమైన థీమ్ పార్టీలు, కలినరీ అనుభవాలతో తమ అతిథులకు ఎప్పుడూ విలాసవంతమైన, సున్నితమైన అనుభవాలను అందించడంలో రాజీపడలేదు. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభమైన నాటి నుండి ఈ అవార్డు గెలుచుకున్న కేఫ్, అద్భుతమైన ప్రయాణం కొనసాగించింది.

ఔట్ ఆఫ్ ద బాక్స్ కార్యక్రమాలు, ఫుడ్ ప్రమోషన్లు, ఎక్కువ ప్రశంసలు పొందిన నూతన మెనూ ఆవిష్కరణలు, ఫుడ్ ఫెస్టివల్స్ మరియు మరెన్నో ప్రతిష్టాత్మక మైలురాళ్లను సృష్టించాయి. జొరావర్ కల్రా, ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, మాసివ్ రెస్టారెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మాట్లాడుతూ “ఫర్జీ కేఫ్ హైదరాబాద్ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను నిర్వహిస్తుండటం పట్ల చాలా సంతోషంగా ఉన్నాను. ఫర్జీ కేఫ్ హైదరాబాద్ వద్ద మా బృందం రెస్టారెంట్ నిర్వహణలో అసాధారణ పాత్ర పోషించడంతో పాటుగా హైదరాబాద్ లో ఎక్కువ మంది ఇష్టపడే కలినరీ, నైట్ లైఫ్ ప్రదేశంగా తీర్చిదిద్దారు” అని అన్నారు.

ferzi cafe

ఈ సందర్భంగా అమన్ చైనేని మాట్లాడుతూ “ఫర్జీ కేఫ్ కు అసాధారణ గుర్తింపు లభించడం పట్ల మేము చాలా ఆనందంగా ఉన్నాం. గత రెండు సంవత్సరాలుగా అసాధారణ విజయాన్ని ఇది నమోదు చేసింది. వినూత్నమైన లైఫ్ స్టైల్ బ్రాండ్ గా ఫర్జీకేఫ్ నిలిచింది. తమ అతిథులకు అసాధారణ ఆతిథ్య అనుభవాలను ఇది తీసుకువచ్చింది. తమ కష్టం మరియు ప్రయత్నాలతో రెస్టారెంట్ ను ఈ స్థాయిలో నిలిపిన సిబ్బందిని అభినందిస్తున్నాను మరియు మా అతిథులను ఈ వేడుకలలో పాల్గొనడంతో పాటుగా ఈ శుభసందర్భాన రెస్టారెంట్ అందిస్తోన్న వినూత్న ఆఫర్లను అన్వేషించాల్సిందిగా కోరుతున్నాం” అని అన్నారు.

- Advertisement -