కాంగ్రెస్‌, బీజేపీ నాయకులవి చిల్లర రాజకీయాలు

318
ministerstyavathi
- Advertisement -

కాంగ్రెస్, బీజేపీ నాయకులు ఆర్టీసీ పేరుతో రోడ్లపై టెంట్లు వేసుకుని చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు గిరిజన సంక్షేమ అభివృద్ధి శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌. మహబూబాబాద్ జిల్లాలో పర్యటన అనంతరం మంత్రి సత్యవతి మీడియా మాట్లాడారు. కార్మికులు యూనియన్‌ నాయకుల ఉచ్చులో పడొద్దన్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేయడానికి ఇది సరైన సమయం కాదని చెప్పారు.

కార్మికుల శ్రేయస్సు కోరి.. విధుల్లో చేరేందుకు సీఎం కేసీఆర్‌ నేటి రాత్రి వరకు గడువు విధించారని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కుదరని పని అన్నారు. రాష్ట్రంలో మొత్తం 91కార్పోరేషన్లు ఉన్నాయని..ఆర్టీసీని విలీనం చేస్తూ మిగతా కార్పోరేషన్లు కూడా విలీనం డిమాండ్ ను తీసుకువస్తాయన్నారు. చిరు ఉద్యోగులకు జీతాలు పెంచిన ఎకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.

- Advertisement -