కోయకుండానే కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి..!

427
onions
- Advertisement -

ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. నిత్యం మనం ఇంట్లో వండే కూరలో ఉల్లిగడ్డలు లేకుండ వండలేము. అలాంటి ఉల్లి ధర అమాంతం పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఉల్లిపాయలను దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో విక్రయిస్తున్నారు రెండు నెలల క్రితం కిలో ఉల్లి ధర రూ.80కి చేరిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉల్లిపాయ ధర 100కు చేరింది. దేశ రాజధానిలో కిలో ఉల్లి ధర రూ.100గా ఉంది.. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 -70 మధ్య అమ్ముతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో వీటి ధర రూ.70 నుంచి 80 మధ్య ఉంది.

onion

అయితే ఈ ఉల్లి ధరలు పెరగడానికి ముఖ్య కారణం ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉల్లి సాగు,దిగుమతులు భారీగా తగ్గిపోయింది. దీంతో కొయ్య కుండానే ఉల్లి ధరలు సామాన్యుడికి కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మార్కెట్లో వీటి ధరలు ఆకాశానికి అంటుకునేలా పెరిగిపోతుండడంతో సామాన్యుడు వీటిని కొనకుండానే వెనుదిరుగుతున్నాడు.

మరోవైపు ఉల్లిపాయల ఉత్పత్తికి ప్రధాన మార్కెట్‌ అయిన మహారాష్ట్ర రైతులు భవిష్యత్తులో మరింత డిమాండ్‌ పెరుగుతుందనే అంచనాలతో ఉల్లిని మార్కెట్‌కు తరలించకుండా, గోదాముల్లోనే దాచిపెడుతున్నారు. ముందస్తు అంచనాలతో రైతులు ఇలా చేస్తున్నారని వాణిజ్య వర్గాలు తెలిపాయి.

- Advertisement -