సోమవారం అబ్దుల్లాపూర్‌మెట్ తహశిల్దార్ కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎమ్మార్వోను విజయారెడ్డిని సురేష్ అనే రైతు అమానవీయంగా పెట్రోలు పోసి సజీవ దహనం చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో విజయ తనను కాపాడుకోవడానికి విఫలయత్నం చేసిన ఎమ్మార్వో (తహశిల్దార్) అందరూ చూస్తుండగానే.. నిమిషాల్లో అగ్నికి ఆహుతయ్యారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. అయితే ఈ ఘటనలో తాసిల్దార్ విజయను కాపాడబోయి ఆమె డైవర్,ఆఫీస్ ప్యీన్ తీవ్రంగా గాయపడ్డారు.
వీరిలో మంటల్లో గాయాలపాలైన డ్రైవర్ గురునాథం ఈ ఉదయం మరణించాడు. నిన్న జరిగిన సంఘటనలో తహశిల్దారు గదిలోకి వెళ్లి, తలుపులు బిగించి, ఆమెకు నిప్పంటించిన సమయంలో, ముందుగా తలుపులను బద్దలుగొట్టి, లోనికి దూసుకెళ్లింది గురునాథమే. ఈ ఘటనలో అతనికి 80 శాతం మేరకు గాయాలు కాగా, అపోలో ఆసుపత్రికి తరలించిన పోలీసులు, చికిత్సను అందిస్తున్నారు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.
సూర్యాపేటకు చెందిన గురునాథం, గడచిన ఎనిమిది సంవత్సరాలుగా విజయారెడ్డి వద్దే డ్రైవర్ గా గుర్నాధం పని చేస్తున్నాడు. ఆమెకు అత్యంత నమ్మకమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్న గురునాథానికి భార్య, ఒక బిడ్డ ఉండగా, ప్రస్తుతం భార్య గర్భవతిగా ఉంది.