భారత అత్యున్నత స్థానం వారిది, వారు ఆజ్ఞాపిస్తే పనులు అవుతాయి కానీ వారు ఆచరిస్తే, వారిని ఆదర్శంగా తీసుకుంటాం.. మేము సైతం అని ఈ రోజు కొంతమంది జిల్లా కలెక్టర్లు గ్రీన్ ఛాలెంజ్‌లో భాగస్వామ్యులయ్యారు. స్తాంప్స్ మరియు రిజిస్ట్రేషన్స్ కమిషనర్ చిరంజీవులు విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ని యాదాద్రి జిల్లా కలెక్టర్ అనితారామచంద్రన్‌లు చెరో మూడు మొక్కలు నాటి మరో ముగ్గురుని నారాయణ పేట కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు , హైదరాబాద్ జాయింట్ కలెక్టర్ రవి గుగులోత్,హైదరాబాద్ డిఆర్ఓ ఎం వి భూపాల్ రెడ్డిని నామినేటెడ్ చేశారు.
ఇందులో భాగంగా నారాయణ పేట కలెక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు గ్రీన్ ఛాలెంజ్‌ని స్వీకరించి మూడు మొక్కలు నాటి మరో ముగ్గురిని.. క్రీడల మంత్రి శ్రీనివాస్ గౌడ్,మక్తల్ ఎమ్మెల్యే చిట్టం రామ్మోహన్, ములుగు జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డిని నామినేటెడ్ చేశారు. ఈ రకంగా రాజు తలుసుకుంటే ఊరు గాజు అవుతుంది అన్నట్టు కలెక్టర్లు తలుచుకుంటే ఊరు పర్యావరణ పరిరక్షణగా, కాలుష్యరహితంగా ఉంటుంది అనడంలో ఆశ్చర్యం లేదు.
Complied mam @Collector_YDR and i planted three plants today in PC kunta village and i promise their survival mam. pic.twitter.com/7WfcHxz2n4
— Collector Narayanpet (@CNarayanpet) November 4, 2019