విజయ భౌతిక కాయానికి మంత్రి నివాళి..

535
- Advertisement -

తహసీల్దార్ విజయ భౌతిక ఖాయనికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నివాళులు అర్పించారు. పెట్రోల్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన అబ్దుల్లా పూర్ మెట్ తహశీల్దార్ విజయ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ సంఘటన తెలిసిన వెంటనే అధికారిక పర్యటనను అర్థాంతరంగా రద్దు చేసుకొని ఘటనాస్థలికి వెళ్లారు మంత్రి సబితా రెడ్డి. ఈ ఘటన చాలా అమానుషమని మంత్రి త్రీవంగా ఖండించారు.

Minister Sabitha Indra Reddy

అబ్దుల్లా పూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో ఘటన స్థలాన్ని పరిశీలించి పోలీస్ లతో వివరాలు అడిగి తెలుసు కున్నారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రిలో విజయ భౌతికఖయానికి నివాళులు అర్పించి ,అక్కడే ఉన్న ఆమె భర్తను ఓదార్చారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఉస్మానియా మార్చురీ వద్ద జిల్లా ఇంచార్జ్ కలెక్టర్ హరీష్‌తో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -