నాడు ఎంజీఆర్…నేడు జయ

177
TN chief minister Jayalalithaa has died
- Advertisement -

తమిళనాడులో రాజకీయ చరిత్ర పునరావృతమైంది. ఇప్పటిలాగే గతంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఎంజీఆర్‌ అనారోగ్యంపాలై అపోలో ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆస్పత్రిలో చేరిన వెంటనే అన్నాడీఎంకే పార్టీలో వర్గ రాజకీయాలు వెలుగులోకి వచ్చాయి. సినీ నిర్మాత, సీనియర్‌ నాయకుడు ఆర్‌ఎం వీరప్పన్‌ నేతృత్వంలోని ఈ వర్గం అప్పట్లో ఆస్పత్రిలో ఉన్న ఎంజీఆర్‌ను కలిసేందుకు జయలలితను అనుమతించలేదు. 1982లో అన్నాడీఎంకేలో చేరిన జయలలిత అతి త్వరలోనే ముఖ్య నాయకురాలిగా పేరుతెచ్చుకున్నారు.

ఆమె ఎదుగుదలను ఓర్వలేకపోయిన వీరప్పన్‌ వర్గం జయలలితను అణచివేసేందుకు ప్రయత్నించింది. జపాన్‌ నుంచి వచ్చిన వైద్యబృందం ఎంజీఆర్‌కు చికిత్స అందజేస్తున్నట్టు ఆమె పార్టీ తరఫున ప్రకటన కూడా విడుదల చేశారు. కానీ. ఈ ప్రకటనను ఖండించిన అప్పటి పార్టీ ప్రధాన కార్యదర్శి పీయూ షణ్ముగం.. జయలలితకు షోకాజ్‌ నోటీసులు జారీచేస్తామని హెచ్చరించారు కూడా.

ఇదంతా గతం కాగా.. ఇప్పుడు వర్తమానంలోనూ గతంలాంటి పరిస్థితే కనిపిస్తోంది.74 రోజులకుపైగా జయలలిత అదే అపోలో ఆస్పత్రిలో  చికిత్స పొందుతు ఇవాళ తుదిశ్వాస విడిచారు.  అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఉదయం అత్యవసరంగా అపోలో ఆస్పత్రిలో భేటీ అయ్యారు. అన్నాడీఎంకే  తదుపరి నాయకత్వంపై చర్చించినట్టు సమాచారం. జయ వారసుడిగా పన్నీరు సెల్వం పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. పన్నీరు సెల్వంకు మద్దతుగా ఎమ్మెల్యేలు సంతకాలు చేసినట్టు సమాచారం. గతంలో జయకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినపుడు పన్నీరు సెల్వం తాత్కాలిక ముఖ్యమం‍త్రిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే.

- Advertisement -