ఎంపీ సంతోష్ చిత్రపటానికి పాలాభిషేకం..

560
mp santhosh kumar
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు మహబూబాబాద్ జిల్లా గూడూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల పాఠశాల విద్యార్థులు. ఎంపీ లాడ్స్ నిధుల నుంచి కావాలసిని నిధులను మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్,సీఎం కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు స్వరూప,జడ్పీటీసీ సుచిత్ర బాలునాయక్‌తో పాటు ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

మరుగుదొడ్డి సదుపాయం లేక మహబూబాబాద్ జిల్లాలో విద్యార్థినులు పడుతున్న ఇబ్బందులపై ఓ పత్రికలో వచ్చిన కథనానికి స్పందించారు సంతోష్. తన ఎంపీ లాడ్స్‌ నిధుల నుంచి తక్షణమే కావాల్సిన నిధులు రూ. 4.5 లక్షలను మంజూరు చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయాలకు అతీతంగా సంతోష్ కుమార్‌పై ప్రశంసలు వెల్లువెత్తుతుండగా  విద్యార్థుల పట్ల ఎంపీ సంతోష్  తీసుకున్న ప్రత్యేక శ్రద్ధను గ్రామస్తులు అభినందించారు. ఈ నేపథ్యంలోనే పాఠశాల బాలికలు ఎంపీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

- Advertisement -